పాము కనిపిస్తే భయపడొద్దు. మనం వాటిని ఏమీ చేయకపోతే. అవి కూడా వాటి మానాన అవి వెళ్లిపోతాయి. దయజేసి సర్పాల్ని చంపొద్దు. పాములు కనిపిస్తే మాకు 8866368899నంబర్ కు ఫోన్ చేయండి. మా బృందం 24గంటలూ వాటిని పట్టుకునిసురక్షితంగాఅడవుల్లోవదిలిపెడతాం..అంటూ విశాఖ వీధుల్లో శనివారం స్నేక్ కేచర్ కిరణ్ స్థానికుల్ని చైతన్యవంతం చేశారు. పాముల రకాలు, అవి కరిస్తే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయిOకోవడం, ఏయే పాములు ఎలాంటివంటూ అందరికీ అవగాహన కల్పించారు. దీంతో జనం కాస్త ఊరట పొందారు. నగరంలోని రామ్మూర్తి పంతులు పేట మహాత్మా గాంధీ గ్రంథాలయం గ్రౌండ్ లో 'అవేర్నెస్ ఆన్ స్నేక్స్' పేరిట నిర్వహించిన కార్యక్రమం అందర్నీ ఆలోచింపచేసింది.
Share