Current Date: 30 Jun, 2024

స్పీకర్ తలచుకుంటేనే..జగన్ కి ప్రతిపక్ష హోదా...!!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఇదిపుడు స్పీకర్ చెయిర్ పరిశీలనలో ఉంది. అయితే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అసలు రాజ్యాంగం ఏమి చెబుతోంది, అలా వీలు అవుతుందా అంటే రాజ్యాంగంలో చూస్తే మొత్తం అసెంబ్లీ సీట్లలోలో పది శాతం సీట్లు వచ్చిన పార్టీకే హోదా ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. అసలు రాజ్యాంగంలో ప్రతిపక్షం గురించి కూడా ప్రస్తావన లేదని నిపుణులు అంటున్నారు. ఇదంతా సభ్యులకు పార్టీలకు ముందు వరసలో సీట్లు కేటయించే విషయంలో 1950 ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న ఒక సర్దుబాటు అని అంటున్నారు. 

Share