Current Date: 04 Jul, 2024

కోళ్ల లలిత కుమారి అనే నేను

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో శు క్రవారం ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో రాష్ట్రంలో గెలుపొందిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం చట్టభద్దంగా జరిగింది. ఇందులో భాగంగా శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించిన కోళ్ల లలిత కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజా విజయంతో 3వ మారు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో సందడి చేశారు. ప్రమాణ స్వీకార మహెూత్సవంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చంనాయుడు, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, ఇతర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె వెంట పలువురు నియోజకవర్గ టీడీపి నాయకులు ఉన్నారు.

Share