Current Date: 04 Oct, 2024

హెలికాప్టర్ నుంచి జారి పడ్డ మరో హెలికాప్టర్

మరమ్మతులకు గురైన ఓ హెలికాప్టర్ జారి నదిలో పడిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ సమీపంలో ఉన్న భీంబాలి వద్ద జరిగింది. కేదార్నాథ్కు ప్రయాణికులను తరలించే క్రిస్టల్ హెలికాప్టర్ ఇటీవల రిపేర్కు వచ్చింది. దానిని ఆర్మీకి చెందిన ఎంఐ17 హెలికాప్టర్తో అధికారులు మరోచోటుకు తరలిస్తుండగా తీగ తెగి కింద మందాకిని నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

Share