ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జులై 4 నుంచి 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8 నుంచి 12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు. 13న ఆప్షన్ల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 17 నుంచి 22లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ నవ్య ప్రకటించారు.