నీట్, నెట్ పరీక్షా పేపర్ లీకేజీలకు నిరసనగా 4న దేశ వ్యాప్త విద్యా సంస్థల బంద్ చేపడుతున్నట్లు ఐక్య విద్యార్థి సంఘాల ( ఎస్ఎఫ్ఐ- ఏఐఎస్ఎఫ్- పిడిఎస్ఓ- ఏఐడీఎస్ఓ ) నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం విద్యా సంస్థల బంద్ చేపడుతున్న గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జగదాంబ జంక్షన్, సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పరీక్షలను అసమర్థంగా నిర్వహణ చేసిన ఎన్ టి ఏ సంస్థ ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర విధ్య శాఖ మంత్రి పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇటీవల జరిపించిన నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ తగిన జాగ్రత్తలు తీసుకుని సక్రమంగా నిర్వహించాలని వారు కోరారు.
విద్యార్థుల భవిత కొసం జూలై 4న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న దేశ వ్యాప్త బంద్ కు అన్ని విద్యా సంస్థలు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.
Share