Current Date: 27 Nov, 2024

సమంత ఇష్యూలో తెలంగాణ మంత్రికి జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్

హీరో నాగార్జున ఫ్యామిలీపై, సినిమా పరిశ్ర‌మ‌పై మంత్రి కొండా సురేఖ చేసిన‌ అనుచిత వ్యాఖ్యలపై  జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోమ‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా వార్నింగ్ ఇచ్చారు.“కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరైంది కాదు. మీరు లాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు గోప్యతకు గౌరవం చూపాలి. సినిమా పరిశ్రమ గురించి నిరాధార ఆరోపణలు చేస్తూ మాట్లాడటం చూస్తే బాధేస్తోంది, ఇతరులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని, అంద‌రూ ఒక‌రి సరిహద్దుల పట్ల గౌరవాన్ని పాటించాలని, ఈ నిర్లక్ష్య ప్రవర్తనను సరిదిద్దాలని.. ఇలాంటివి సినిమా పరిశ్రమ సహించదు” అంటూ ట్వీట్ట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.ఇప్పటికే మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ, సమంత తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా పెద్ద హీరోలు, నటులు కూడా స్పందిస్తున్నారు. దాంతో కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Share