Current Date: 17 Feb, 2026

భారత్, పాక్ మ్యాచ్‌ హైలైట్స్.. నో షేక్ హ్యాండ్స్!

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేస్తూ పాకిస్థాన్‌పై 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.  176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌, భారత బౌలర్ల ధాటికి 18 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. ఇరు జట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మ్యాచ్‌కు ముందు గాయకుడు హనుమాన్‌ కాయిన్డ్ 'దురంధర్‌' సినిమా పాటను పాడలేదు.  మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడం గమనార్హం. కొలంబో పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించడంతో ఈ మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో స్పిన్ మాయాజాలం కొనసాగింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పాకిస్థాన్ ఏకంగా ఆరుగురు స్పిన్నర్లను ప్రయోగించింది. భారత జట్టు కూడా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్లను కలిపి ఐదుగురిని ఉపయోగించింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లే 11 వికెట్లు పడగొట్టి ఆధిపత్యం చలాయించారు. అద్భుత బ్యాటింగ్‌తో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.