Current Date: 27 Nov, 2024

బండారు దత్తాత్రేయకి తప్పిన ప్రమాదం, ఒక డ్రైవర్ చేసిన తప్పిదానికి?

 హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో  హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన జరిగింది. గవర్నర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.   గవర్నర్ వాహనం శంషాబాద్‌ విమానాశ్రయానికి దగ్గర్లోకి రాగానే... ఓ కారు సడెన్‌కు ఎడమ వైపునకు తిరిగింది. దాంతో  గవర్నర్ కాన్వాయ్‌లోని కార్‌ డ్రైవర్‌ కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో ముందుగా వెళ్తున్న కారు సడెన్‌ బ్రేక్‌ కొట్టారు. ఆ కారును వెనుక నుంచి వస్తున్న మూడు  కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి.   వెంటనే సెక్యురిటీ సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి బండారు దత్తాత్రేయ కారును సెఫ్టీగా ముందుకు వెళ్లేలా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎండీవర్ కారుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share