ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందలేదు. పాత టెంప్లేట్ కథ, మూస ధోరణిలో సాగే సన్నివేశాల వల్ల సినిమా ఫ్లాప్ అయిందనేది ట్రేడ్ వర్గాల అంచనా. అయితే, దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఈ నిజాన్ని అంగీకరించకుండా, సినిమా సూపర్ హిట్ అనే రేంజ్‌లో ప్రమోషన్లు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో 'రాజాసాబ్' దర్శకుడు మారుతి కూడా సినిమా ఫలితం తర్వాత విమర్శలను మౌనంగా భరించారు. కానీ హరీష్ శంకర్ మాత్రం సినిమాలో జరిగిన తప్పులను, విమర్శలను సమర్థించుకుంటూ విచిత్రమైన వివరణలు ఇస్తుండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ గురించి ట్రోల్ నడుస్తోంది. పవన్ ఫస్ట్‌లోనే జీప్ దిగినట్లు సీన్ పెట్టి.. ఆ తర్వాత మళ్లీ జీపు నుంచి జంప్ చేస్తున్నట్లు చూపించారు. దాంతో వస్తున్న ట్రోల్స్‌కు ఆయన ఇస్తున్న వింత సమాధానాలు విమర్శలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఫ్లాప్ అయిన సినిమా గురించి పదేపదే మాట్లాడినంత మాత్రాన అది హిట్ అయిపోదని, వాస్తవాన్ని గ్రహించకుండా తప్పులను సమర్థించుకోవడం వల్ల దర్శకుడు నవ్వులపాలవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు, ఇప్పుడు అదే తరహా టెంప్లేట్‌తో వచ్చి విమర్శల పాలవ్వడం గమనార్హం.
Share