Current Date: 15 Feb, 2026

జగపతిబాబు నోటి నుంచి రక్తం.. అయినా డబ్బింగ్ ఆపలే!

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అరవింద సమేత'లో బసిరెడ్డి పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ పాత్రకు ఆ గంభీరమైన, మొరటు వాయిస్ తీసుకురావడం కోసం జగపతిబాబు గారు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ విలక్షణమైన గొంతు కోసం గంటల తరబడి, రోజుల తరబడి డబ్బింగ్ చెప్పడం వల్ల తన స్వరపేటిక దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఒక దశలో గొంతుపై విపరీతమైన ఒత్తిడి పడి దగ్గినప్పుడు నోటి నుంచి రక్తం కూడా వచ్చిందని, ఆ పాత్రపై ఉన్న పిచ్చి కసితోనే తాను అంత రిస్క్ తీసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.  సినిమా క్లైమాక్స్ విషయంలో కూడా ఒక ఆసక్తికరమైన మార్పు జరిగిందని జగపతిబాబు తెలిపారు. మొదట స్క్రిప్ట్ ప్రకారం క్లైమాక్స్‌లో ఒక సాధారణమైన భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట. అయితే షూటింగ్‌లో బ్రేక్ వచ్చిన సమయంలో జగపతిబాబు నేరుగా త్రివిక్రమ్ వద్దకు వెళ్లి, "ఏంటి శ్రీనూ.. నువ్వు కూడా రెగ్యులర్ క్లైమాక్స్‌లేనా? ఇది కాస్త బోర్ కొడుతోంది, మార్చవయ్యా" అని సలహా ఇచ్చారట. దీంతో త్రివిక్రమ్ తన టీమ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లతో చర్చించి, రెండు రోజుల వ్యవధిలో పూర్తి క్లైమాక్స్‌ను మార్చివేసి ఇప్పుడు మనం చూస్తున్న విభిన్నమైన ముగింపును సెట్ చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. జగపతిబాబు చూపించిన డెడికేషన్ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ముఖ్యంగా "మచ్చల పులి గాండ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా?" అనే డైలాగ్‌కి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. షూటింగ్ సమయంలోనే కాదు, డబ్బింగ్‌లో కూడా రక్తం వచ్చేంతగా కష్టపడి ఆయన అందించిన ఆ 'షాకింగ్ వాయిస్' బసిరెడ్డి పాత్రను తెలుగు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ విలన్ పాత్రగా నిలబెట్టింది.