ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్ పదవికి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ రాజీనామా చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని స్టెయిన్ స్వయంగా వెల్లడించాడు. అయితే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కోచ్‌గా మాత్రం కొనసాగనున్నట్లు చెప్పాడు. అతడి స్థానంలో తాత్కాలికంగా కివీస్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఇప్పుడు స్టెయిన్ పూర్తిగా దూరం కావడంతో ఫ్రాంక్లిన్‌ను రెగ్యులర్ కోచ్‌గా నియమించే అవకాశం ఉంది.