Current Date: 02 Jul, 2024

రోజూ ఉదయం 5 నిమిషాలు ఎండలో.. ఫుల్ డే‌కి ఎనర్జీ!

ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రోజుంతా కష్టపడి పని చేసేవారు తప్పకుండా ఉదయం పూట సూర్యరశ్మిలో కొద్దిసేపైనా గడపడం చాలా అవసరం. ఎందుకంటే ఉదయం పూట సూర్యుడి కాంతి నుంచ వచ్చే కిరణాల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి.

ప్రతి రోజు ఉదయం పూట 5 నిమిషాల పాటు సూర్య కిరణాలు శరీరంపై పడితే..శరీరంలోని సెరోటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా రోజంతా ఎంతో ఉత్సహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని వారంటున్నారు.

నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయం పూట సూర్య కిరణాలు పడే చోట కూర్చొవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రాత్రిపూట నిద్ర కూడా తేలికగా పడుతుంది. దీంతో పాటు సిర్కాడియన్ రిథమ్‌ను కూడా మెరుగుపరుచుతుంది. ఈ సూర్యకాంతి నుంచి విటమిన్ డి కూడా పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.