తెలంగాణలో తాటి, ఈత కల్లుతో వైన్ తయారీ పరిశ్రమ.. సీఎం రేవంత్ రెడ్డితో జర్మన్ ప్రతినిధి భేటీ...
Mar 28, 2025
ఈత, తాటి కల్లు రెండు ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో ప్రత్యేకంగా వినియోగంలో ఉన్న పానియాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తాటి, ఈత కల్లు వినియోగం ఎక్కువ. వీటిని తాగడం వల్ల రుచితోపాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈత, తాటి చెట్ల నుంచి కల్లును గీస్తూ గీత కార్మికులు అనేమంది ఉపాధి పొందుతున్నారు. అయితే, వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా గత ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. తాజాగా. గీత కార్మికులు ఆర్థికాభివృద్ధి సాధించేలా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే కల్లుతో వైన్, అరక్ తదితర అనుబంధ పదార్థాల తయారీ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను స్టీఫెన్ కలిశారు. తెలంగాణలో తాటి, ఈత కల్లుతో వైన్స్ , అరక్ తదితర అనుబంధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని తెలిపారు.