Current Date: 31 Mar, 2025

పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్.. వరుడు ఎవరు? ఏం చేస్తారంటే?

హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. తన స్నేహితుడు ఆంటోనిని  గురువారం రాత్రి వివాహం చేసుకుంది. గోవాలోని ఓ రిసార్ట్‌లో వీరి పెళ్లి హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సన్నిహితులు వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు.ఎవరు ఈ ఆంటోని అంటే.. స్కూల్ డేస్ నుంచి కీర్తి సురేష్‌కి ఫ్రెండ్. ఇద్దరూ కాలేజీ డేస్‌ వరకు చదువుకున్నార. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు ఈ జంట ప్రేమాయణం నడిపినా.. ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే.. పెళ్లికి ముందు దీపావళి రోజున ఆంటోనితో దిగిన ఫొటోని కీర్తి సురేశ్ షేర్ చేసింది. తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపింది.ఆంటోని కొచ్చి ప్రాంతానికి చెందిన బిజినెస్‌మెన్. చెన్నై, కొచ్చిలో వారికి వ్యాపారాలున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆంటోనీ.. గ్రాడ్యుయేషన్ తర్వాత ఖతర్‌లో చాలా కాలం పనిచేశారు. ఆయనకు దుబాయ్‌లో కూడా వ్యాపారాలున్నాయి. రిసార్ట్ లతో సహా ఎన్నో రకాల బిజినెస్‌లను ఆంటోని చేస్తూ ఉంటారు. కేరళ, చెన్నై అంతటా కూడా హాస్పిటల్ వెంచర్లలో కూడా ఆంటోనికి వ్యాపారాలు ఉన్నాయి.

Share