Current Date: 02 Jul, 2024

బుర్ర బాగా పనిచేయాలంటే.. రోజుకి 4వేల అడుగులు నడక

మన బుర్ర బాగా పనిచేయాలంటే.. మంచిగా తినడం, బాగా నిద్రపోవడం మాత్రమే కాదండోయ్..  రోజుకు కనీసం 4వేల  అడుగులు నడవాలట. అధ్యయనాలు కూడా ఇదే చెబుతున్నాయి. వ్యాయామం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో ప్రచురించిన ఓ అధ్యయనాన్ని  పరిశీలించగా రోజుకు కొన్ని వేల అడుగులు వ్యాయామం చేయడం కూడా మెదడు వాల్యూమ్‌తో ముడిపడి ఉంటుందని తేలింది.

వ్యాయామం జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు..  మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మెదడు పనితీరు అభివృద్ది చెందాలంటే వాకింగ్​ అవసరమని వైద్య పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ 4వేల అడుగులు నడవడం వలన   మెదడుకు రక్తప్రసరణలో ఎలాంటి ఇబ్బంది ఉందదు, మెదడు కావలసిన  పోషకాలు ,  ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తుంది.

నడక నాడీ మార్గాలను బలోపేతం చేస్తుంది.   నడక  డోపమైన్,  సెరోటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ ఉత్పత్తి  చేస్తుంది, ఇవి మానసిక స్థితిని నియంత్రించి జ్ఞానాన్ని అభివృద్ది చేయడంలో  కీలక పాత్ర పోషిస్తాయి. 10, 125 మంది పాల్గొన్న ఈ సర్వేలో తేలిందేమంటే..నడిచినా, పరుగెత్తినా లేదా గేమ్స్ ఆడినా సమస్య పరిష్కార నైపుణ్యాలు, జ్ఞానశక్తిని మెరుగవుతుందని తేలింది.