బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కుప్పకూలింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను కివీస్ బౌలర్లు వణికించారు. ప్రత్యర్థి బౌలర్లు విజృంభించడంతో భారత జట్టు భోజన విరామానికి 34 పరుగులకే 6 వికెట్లు పారేసుకుంది. ఆ తర్వాత కూడా భారత్ ఇన్నింగ్స్ గాడిలో పడలేదు. దాంతో 46 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో ఐదుగురు డకౌట్ అయ్యారు. కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లు తీయగా విలియం ఓ రూర్కే నాలుగు వికెట్లతో భారత ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు.