అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌కు సంబంధించి ఇండియన్ రైల్వేస్ కీలక మార్పు చేసింది. దీపావళి పండుగకు ముందు ఈ కీలక మార్పును ప్రకటించింది. నవంబర్ 1వ తేదీ నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే నవంబర్ 1వ తేదీకి ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. అదే సమయంలో విదేశీయులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ సమయం కొనసాగుతుందని వెల్లడించింది.