Current Date: 10 Oct, 2024

పేదోడి కారు కలని తీర్చిన రతన్ టాటా జీవిత చరిత్ర

రతన్‌ టాటా 1937 డిసెంబరు 28వ తేదీన నావల్‌ టాటా, సోనూలకు జన్మించారు. ముంబయిలోని కాంపియన్‌ పాఠశాలలో 8వ తరగతి వరకు చదివి.. ఆ తర్వాత కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ పాఠశాలలో చదువు కొనసాగించారు. శిమ్లాలోని బిషప్‌ కాటన్‌ పాఠశాలలోనూ రతన్ టాటా చదివారు.1955లో న్యూయార్క్‌లోని రివర్‌డేల్‌ కంట్రీ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చేరి అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు. 1962లో టాటా స్టీల్‌లో చేరడం ద్వారా తన వృత్తి జీవితాన్ని రతన్‌ టాటా ప్రారంభించారు. 1991లో టాటా సన్స్‌ ఛైర్మన్‌గా జేఆర్‌డీ టాటా వైదొలుగుతూ రతన్‌ టాటాను వారసుడిగా ప్రకటించారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రతన్‌ టాటా.. సంస్థను భారీగా విస్తరించారు.పేదవాడి కారైన టాటా నానోతోపాటు టాటా ఇండికా కార్లను మార్కెట్‌కు పరిచయం చేశారు. లక్ష రూపాయాలకే నానో కారుని అమ్మి పేదవాడి కారు కలని అప్పట్లో టాటా తీర్చారు. కానీ.. 2012 డిసెంబరు 28న తన 75వ పుట్టిన రోజునాడు టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి రతన్‌ టాటా వైదొలగారు. అప్పటి నుంచి ఆయన కనిపించడం కూడా బాగా తగ్గిపోయింది. బుధవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Share