మీరు రూపాయి డాక్టర్, 5 రూపాయల డాక్టర్ గురించి విని ఉంటారు. కానీ.. మూడు అడుగుల డాక్టర్ గురించి విన్నారా? గుజరాత్‌కు చెందిన గణేశ్ బరైయా వయసు 23ఏళ్లు. కానీ.. ఎత్తు మాత్రం కేవలం 3 అడుగులు.
కానీ.. గణేశ్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్‌లో 233 మార్కులు సాధించారు. అయితే ఎత్తును కారణంగా చూపించి.. మెడికల్ కాలేజీలో గణేశ్ బరైయాకు సీటు ఇచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన గణేశ్.. ఎట్టకేలకి విజయం సాధించాడు.
నీట్‌లో మంచి మార్కులు వచ్చినప్పటికీ.. ఎత్తును సాకుగా చూపించి తనకు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ గణేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కాలేజీ ప్రిన్సిపల్ కటారియా గణేశ్ అందించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం గణేశ్‌కు మెడికల్ కాలేజీలో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో గణేశ్ బరైయాకు ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ లభించింది. ప్రస్తుతం ఆయన మెడికల్ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా భావ్‌నగర్ వైద్య కళాశాలలో రోగులకి వైద్యం చేస్తున్నారు. తాను డెర్మటాలజిస్టు కావాలని అనుకుంటున్నానని గణేశ్ అంటున్నారు. ప్రస్తుతం గణేశ్ ప్రపంచంలోనే అతి పొట్టి డాక్టర్‌గా రికార్డు సృష్టించారు.