Current Date: 07 Oct, 2024

పాక్‌లో లీటర్ ఆవు పాలు రూ.370 ప్రజలు లబోదిబో!

పాకిస్తాన్‌లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొత్త పన్నులతో పాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్ పాలపై ఆ దేశ ప్రభుత్వం 18 శాతం పన్ను విధించింది. దీంతో పాల ధరలు 25 శాతం పైగా పెరిగాయి. దాంతో పాల ధర రూ.370కు చేరింది.ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.దీంతోపాటు ఆ దేశంలో ఉన్న చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. పాకిస్తాన్ ఇప్పటికే సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని, ఇలాంటి తరుణంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.

Share