ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి మిగిలిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. దేశంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని, మొదట 20 మ్యాచ్‌లకే షెడ్యూల్ ఇచ్చిన బోర్డు, ఇప్పుడు లీగ్ దశలో మిగిలిన 50 మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 13న హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే పోరుతో ఈ రెండో దశ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. కేవలం హైదరాబాద్ (ఉప్పల్ స్టేడియం) మాత్రమే వేదికగా నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన హోమ్ మ్యాచ్‌న్నీ ఇక్కడే ఆడనుంది. విశాఖపట్నంకు ఈసారి ఏ మ్యాచ్ కేటాయించలేదు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొన్ని హోమ్ మ్యాచ్‌లను వైజాగ్‌లో ఆడేది, కానీ ఈసారి వారు తమ అన్ని మ్యాచ్‌లను ఢిల్లీలోనే ఆడాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు మే 24తో ముగుస్తాయి. టోర్నీలో మొత్తం 8 డబుల్ హెడర్ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు)లు ఉన్నాయి. ఇక కీలకమైన ప్లేఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే, మే 31న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుందని సమాచారం.
Share