ఏపీలో అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి లోకేశ్ దసరా సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకూ మొత్తం 11 రోజుల పాటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో వచ్చిన వరద కారణంగా టీచర్స్ డేను నిర్వహించలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డేను బాగా సెలబ్రేట్ చేయాలని అధికారులకు సూచించారు. అలాగే నవంబర్ 14న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు తాను స్వయంగా రివ్యూ చేస్తానని మంత్రి పేర్కొన్నారు.
Share