Current Date: 31 Mar, 2025

కన్‌ప్యూజన్‌లో బన్నీ.. 3 నెలలుగా నెక్ట్స్‌మూవీపై సస్పెన్స్

పుష్ప 2 మూవీ వచ్చి దాదాపు మూడు నెలలు దాటేసింది. నెక్ట్స్ ఏ సినిమా.. ఎవరితో చేస్తాడనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. వాస్తవానికి అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు చాలామంది దర్శకులు రెడీగా ఉన్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీ బడ్జెట్ రూ.600 కోట్లుకాగా.. తనకే రూ.100 కోట్లు ఇవ్వాలని అట్లీ డిమాండ్ చేస్తున్నాడట. దాంతో ఈ సినిమా చర్చ దశలోనే ఉంది. మరోవైపు త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు బన్నీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే.. ఈ సినిమా పీరియాడిక్ సెటప్ ఉన్న కథ కావడంతో ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైమ్ పట్టేలా ఉంది. ఒకవేళ అట్లీ ప్రాజెక్ట్ ఓకే అయితే మాత్రం త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమా వచ్చే ఏడాదే మొదలవుతుంది. ఇద్దరూ టాప్ డైరెక్టర్లే కావడంతో.. ఎవరితో ఫస్ట్ సినిమా చేయాలి? అనే తర్జనభర్జనలతో బన్నీ కాలం గడిపేస్తున్నాడు.

Share