జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేయాలని పార్లమెంటు సభ్యులు సి.ఎం. రమేష్ తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్, పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్, శాసనసభ్యులు హాజరయ్యారు. సమావేశంలో పార్లమెంటు సభ్యులు సి.ఎం.రమేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి ప్రధానమంత్రి మన ప్రాంతానికి వస్తున్నారని వారికి జిల్లా తరపున ఘనస్వాగతం పలకాలని తెలిపారు. సాంస్కృతిక బ్రందాల ప్రదర్శనలతో స్వాగత ఏర్పాటుచేయాలని తెలిపారు. ప్రజలకు అందించే ఆహారం నాణ్యతగా తయారుచేయాలని తెలిపారు. బస్సులు రవాణాకు ఎటువంటి యిబ్బందులు రాకుండా ముందుగానే పోలీసు శాఖ రూటు ఖరారు చేసుకోవాలని తెలిపారు.