Current Date: 06 Jul, 2024

రుషికొండ ప్యాలెస్‌‌లోకి మంత్రి నారా లోకేష్? జోరుగా చర్చ

వైయస్ జగన్ కలల భవనం రూ.600 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా కట్టించిన విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌లోకి అడుగు పెట్టకుండానే ఆయన సీఎం పదవి నుంచి దిగిపోయారు. రుషికొండ ప్యాలెస్ లో ఏముందో నిర్మాణ విలువలు ఏమిటి అన్నది ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను వెంటబెట్టుకుని వెళ్ళి మరీ లోకానికి చూపించారు. దాంతో ప్రజాధనంతో జగన్ సొంత ప్యాలెస్ కట్టుకున్నారు అని టీడీపీ ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది.రుషికొండ ప్యాలెస్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దాని మీద అనేక రకాలుగా ప్రతిపాదనలు వస్తున్నాయి. అక్కడ ఐటీ పార్క్ ని ఏర్పాటు చేయాలని తాజాగా ఒక ప్రతిపాదన ఐటీ నిపుణుల నుంచి వచ్చింది అని అంటున్నారు. అలాగే ప్రభుత్వం నిర్వహించే భారీ సదస్సులకు వేదికగా మార్చుకోవాలని సూచనలు వస్తున్నాయి. ఇప్పటిదాకా స్టార్ హోటళ్లలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనం ఖర్చు చేసి విశాఖలో ప్రభుత్వం సదస్సులు నిర్వహించేది. అలా కాకుండా రుషికొండ ప్యాలెస్ ని వాడుకుంటే ప్రభుత్వ డబ్బు ఆదా అవుతుందని ఆలోచిస్తున్నారు.మంత్రి నారా లోకేష్ క్యాంప్ ఆఫీసుగా ఇందులోని కొంత భాగాన్ని వాడుకోవాలని చూస్తున్నారట. విశాఖ జిల్లాకు లోకేష్ ఇంచార్జి మంత్రి అవుతారని ప్రచారం సాగుతోంది. దాంతో లోకేష్ విశాఖలో ఉంటే ఈ ప్యాలెస్ లోనే క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటే బాగుంటుందని సలహాలు వచ్చాయని అంటున్నారు. త్వరలో లోకేష్ చంద్రబాబు విశాఖ వచ్చి రుషికొండ ప్యాలెస్ ని చుస్తారని అంటున్నారు.

Share