Current Date: 30 Jun, 2024

మంగళగిరిలో 28న ‘పల్లా’ ప్రమాణ స్వీకారం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈనెల 28న మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వైభవంగా జరిగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానాలు పంపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో పల్లా శ్రీనివాస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ప్రమాణం చేసి అనంతరం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లాతో పాటు గాజువాక నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు తరలి వెళ్లేందుకు జోరుగా సన్నాహాలు చేస్తున్నారు.

Share