ఒక పక్క కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కేంద్రం అనుకున్నంత పనీ చేసేస్తోంది.విశాఖ ఉక్కు పీక నులిమేసే పనికి శ్రీకారం చుట్టేసింది. అయినా రాష్ట్రం లోని కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరొత్తి నట్టు కూర్చుంది.కేంద్రఉక్కు ఘనుల శాఖా మంత్రి కుమార స్వామి సారధ్యం లో జరిగిన సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు చూస్తే తెలుగు ప్రజలు గుండెలు బాదుకోవడం తప్ప మరేమీ చేయలేని దురవస్థ లో పడిపోయారు. 2500 మంది ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఇచ్చి ఇంటికి పంపేయాలని నిన్న జరిగినసమావేశలో నిర్ణయమయింది . దీని కోసం 1260 కోట్ల రూపాయలు కేటాయించ డానికి కేంద్రం సిద్ధమయింది. మరో 500 మంది ఉద్యోగుల్ని బదిలీపై డెప్యూటేషన్ ఛత్తిష్ ఘడ్ లోని నాగర్నార్ (ఎన్ఎండిసి )ప్లాంట్ కు పంపిస్తారు. ఇది కాకుండా మరో మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులకు పూర్తి గా ఉద్వాసన పలకడానికి ఈ సమావేశం నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం జరగనున్న కాబినెట్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోడాని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం.
Share