Current Date: 31 Mar, 2025

క్రికెటర్ క్యాప్‌కి వేలంలో రూ.2.12 కోట్లు.. అంత స్పెషల్ ఎందుకంటే?

క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ ధరించిన ‘బ్యాగీ గ్రీన్‌’ క్యాప్‌కు ఊహించినట్లుగానే వేలంలో భారీ ధర పలికింది. 1947–48లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ధరించిన ఈ క్యాప్‌పై వేలంలో  పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఆసక్తి కనబరిచారు. స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు అప్పట్లో ఇదే చివరి సిరీస్‌ కాగా... ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా బ్రాడ్‌మన్‌ ఏకంగా 715 పరుగులు సాధించడం విశేషం.పది నిమిషాల పాటు సాగిన వేలంలో చివరకు ఒక వీరాభిమాని 2 లక్షల 50 వేల డాలర్లకు భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2.12 కోట్లకి సొంతం చేసుకున్నాడు. దాదాపు 77 ఏళ్ల క్రితం వాడి రంగులు వెలిసిపోయి, కాస్త చినిగిపోయిన ఈ టోపీ లోపలి భాగంలో బ్రాడ్‌మన్‌ పేరు రాసి ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రాడ్‌మన్‌ విలువ ఏమిటో ఈ వేలం ధర చూపించింది.భారత్‌తో సిరీస్‌ ముగిశాక బ్రాడ్‌మన్‌ క్యాప్‌ను భారత జట్టు మేనేజర్‌ పంకజ్‌ గుప్తాకు బహుమతిగా అందజేశారు. ఈ సిరీస్‌లో భారత జట్టు వికెట్‌ కీపర్, ఆ తర్వాత తన మేనకోడలిని పెళ్లాడిన ప్రబీర్‌ కుమార్‌ సేన్‌కు పంకజ్‌ గుప్తా ఇచ్చారు. అదే క్యాప్‌ ఇప్పుడు వేలానికి వచ్చింది.

Share