ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ముకుల్ చౌదరి వీరోచిత ఇన్నింగ్స్‌తో లక్నోను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా, అజింక్య రహానె (41), రఘువంశీ (45) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లఖ్‌నవూ ఒక దశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఆయుష్ బదోని (54) అందించిన పునాదితో, ముకుల్ చౌదరి (54 నాటౌట్) ఆఖరి వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ అభిమానుల గుండె వేగాన్ని పెంచేసింది. లక్నో విజయానికి చివరి 6 బంతుల్లో 14 పరుగులు అవసరమైన వేళ, క్రీజులో ఉన్న అవేశ్ ఖాన్ తొలి బంతికే సింగిల్ తీసి ముకుల్ చౌదరికి స్ట్రైక్ ఇచ్చాడు. రెండో బంతిని ముకుల్ సిక్సర్‌గా మలచడంతో సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులుగా మారింది. అయితే, ఆ తర్వాతి రెండు బంతులకు పరుగులేమీ రాకపోవడంతో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. చివరి 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన ఉత్కంఠభరిత స్థితిలో, ఐదో బంతిని ముకుల్ మరో భారీ సిక్సర్‌గా మలిచి స్కోర్లను సమం చేశాడు. ఆఖరి బంతికి పరుగు రాకపోయినా, బై రూపంలో వచ్చిన సింగిల్‌తో లక్నో విజయం ఖాయమైంది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ రెండేసి వికెట్లు తీసినప్పటికీ లఖ్‌నవూ లోయర్ ఆర్డర్ పోరాటాన్ని అడ్డుకోలేకపోయారు. కోల్‌కతాకు ఇది ఈ సీజన్‌లో నాలుగో మ్యాచ్ కాగా, అందులో మూడో ఓటమి కావడం గమనార్హం. వర్షం కారణంగా పంజాబ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో లఖ్‌నవూకు ఒక్క పాయింట్ లభించగా, తాజా విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో తన స్థితిని మెరుగుపరుచుకుంది.