Current Date: 07 Apr, 2026

ఐపీఎల్‌ 2026లో లాస్ట్‌కి పడిపోయిన చెన్నై.. పాయింట్ల పట్టికలో పంజాబ్ టాప్

ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించగా, పంజాబ్ కింగ్స్ మొత్తం 5 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది.పట్టికలో మొదటి నాలుగు స్థానాల కోసం జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలో 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. నెట్ రన్ రేట్ పరంగా చూస్తే +2.501తో ఆర్సీబీ మెరుగైన స్థితిలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్‌లలో ఒక విజయం, రెండు ఓటములతో 2 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఈ సీజన్‌లో ఆందోళనకరంగా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైన చెన్నై, ఇప్పటివరకు ఖాతా తెరవకుండా పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. వర్షం వల్ల లభించిన ఒక పాయింట్‌తో కోల్‌కతా 8వ స్థానానికి చేరుకోగా, గుజరాత్ టైటాన్స్ 9వ స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ప్రతి మ్యాచ్ ఫలితం జట్ల స్థానాలను తలకిందులు చేస్తుండటంతో తదుపరి పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.