ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను గురువారం రాత్రి విడుదల చేశాయి. ఈ జాబితాలో ఎవరూ ఊహించని క్రికెటర్‌కి అత్యధిక ధర దక్కింది. ఐపీఎల్ 2025 రిటెన్షన్స్‌లో విరాట్ లేదా రోహిత్‌కు అత్యధిక ధర దక్కుతుందని అనుకున్నారు.కానీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక ధర దక్కింది. క్లాసెన్‌పై ఎస్ఆర్హెచ్ ఏకంగా రూ. 23 కోట్లు వెచ్చించింది. భారత స్టార్ల విషయానికొస్తే.. విరాట్‌కు రూ. 21 కోట్లు.. రోహిత్‌కు రూ. 16.30 కోట్లు లభించాయి. భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ వేలానికి వదిలేసింది. దాంతో ఈ నెలలో జరిగే వేలంలో పంత్కి రూ.25-30 కోట్లు ధర పలికే అవకాశం ఉందని అప్పుడే ప్రచారం మొదలైపోయింది. పంత్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గట్టిగా పోటీపడనున్నాయి.
Share