ఆదివారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సంబంధించిన కార్యనిర్వాహక కార్యాలయంలో అగ్ని ప్రమాదాన్ని సృష్టించి గతంలో చైర్మన్గా పనిచేసిన వై వి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి చేసిన 2000 కోట్ల రూపాయల భక్తుల సొమ్ము అవినీతి బాగోతం బయటకు రాకుండా ఉండేందుకోసం అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని, ప్రభుత్వ శాఖల్లో ప్రజాధనాన్ని కాజేయటమే కాకుండా చివరాఖరుకు దేవుడు సొమ్మును కూడా కాజేసే దుశ్చర్యకు జగన్ ప్రభుత్వం వైసీపీ నాయకులు దిగజారి అగ్ని ప్రమాదం సృష్టించారని, శ్రీవాణి, ఎల్ వన్, వీఐపీ బ్రేక్ తదితర దర్శనాలు మరియు ఇంజనీరింగ్,ఆహార కాంట్రాక్టులు తదితర అంశాల్లో అనేక అవినీతి జరిగిందని, ఈ డబ్బంతా భక్తుల సొమ్మని, దీనిపైన తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారైనా, అధికారులు ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షించాలని శ్రీధర్ కోరారు. గత ఐదేళ్లలో జగన్ పాలనలో ఏ ఒక్క కార్యాలయంలో కూడా ఒక్క ఫైలు ఎందుకు తగలబడలేదు, ఒక్క అగ్నిప్రమాదం కూడా ఎక్కడా జరగలేదు.
Share