Current Date: 27 Nov, 2024

సీఎంని అవమానించిన 11 మందిపై కేసు నమోదు నిమిషాల్లో అరెస్ట్


ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడిలో ఆదివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని అవమానిస్తూ ఆందోళన నిర్వహించారని 11 మంది బీఆర్‌ఎస్ నాయకులు, రైతులపై తలమడుగు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.రుణమాఫీ కాలేదంటూ బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పలువురు రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని వీధుల్లో ‘సీఎం శవయాత్ర’ పేరిట ప్రదర్శన చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన చేయడంతో బీఆర్‌ఎస్ నాయకులు నిమ్మల సుదర్శన్‌రెడ్డి, పూండ్రు పోతారెడ్డి, కుమ్మరి భూమన్న, అల్లూరి సతీష్‌రెడ్డి, బహుద్దూర్‌ నర్సింలుతోపాటు రైతులు గోక లక్ష్మారెడ్డి, పూండ్రు ఉపేందర్‌రెడ్డి, నక్క ధనుంజయ్, నిమ్మల సూర్యసేన్‌రెడ్డి, ఊరుకొండ దత్తు, విపుల్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు.గౌరవప్రదమైన పదవిలో ఉన్న సీఎంను కించ పరుస్తూ శవయాత్ర చేయడం అప్రజాస్వామికమని, ఇలా ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

Share