Current Date: 30 Sep, 2024

ఆల్బుసెల్ 20% మందు దొరకక ప్రాణాలు కోల్పోతున్న రోగులు

ఆల్బుసెల్ 20% మందు ప్రధానంగా క్లినికల్, అత్యవసర పరిస్థితుల్లో రక్తంలో ఆల్బ్యూమిన్ స్థాయిలు పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది మానవ ఆల్బ్యూమిన్‌తో తయారవుతుంది. శరీరంలో ద్రవం, రక్త శాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు ఏపీలో ఈ మందు దొరకక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.ఆల్బుసెల్ 20% ఎవరెవరికి? ఏ సమయాల్లో వాడతారంటే? లోబీపీ ఉన్నప్పుడు లేదా ప్రమాదాల్లో ఎక్కువ రక్తం కోల్పోయినప్పుడు రక్త పరిమాణాన్ని పెంచడానికి ఆల్బుసెల్ 20%ను ఉపయోగిస్తారు. రక్తంలో ఆల్బ్యూమిన్ స్థాయిలు తగ్గినప్పుడు సెప్టిస్మియా, పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలు వంటి సందర్భాల్లోనూ ఈ ఆల్బుసెల్ 20%ను వినియోగిస్తారు.తీవ్రంగా కాలిన గాయాలు అయినప్పుడు కూడా వాడతారు. అప్పుడప్పుడు అసిటిస్ స్థాయిని తగ్గించడానికి కూడా  ఉపయోగిస్తారు.ఆల్బుసెల్ 20% శరీరంలో రక్తనాళాల నుంచి కణజాలాల్లోకి ద్రవం ప్రవహించకుండా ఉండి, రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. 

Share