Current Date: 27 Nov, 2024

కంటైనర్ పోర్టు పని తీరు సూచీలో టాప్-20లో విశాఖ పోర్టు అభినందనల వెల్లువ

 ప్రపంచ బ్యాంక్ రూపొందించిన కంట్కెనర్ పోర్టు పని తీరు సూచీలో విశాఖ పోర్టు 18వ స్థానం సాధించి నూతన అధ్యాయాన్ని సృష్టించింది. విశాఖ కంట్కెనర్ టెర్మినల్ ఈ నూతన మైలురాయిని చేరుకోవడంలో అత్యధ్భుత ప్రతిభను కనబర్చింది. కంట్కెనర్ పోర్టు పని తీరు సూచీల్ని లెక్కించడంలో పూర్తిగా నౌక బెర్తింగ్పై దృష్టి పెడుతుంది.  అనే అంశం ద్వారా పని తీరును పరిగణలోకి తీసుకుంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సూచీల ద్వారా వ్యాపారస్తులు ఏ పోర్టును ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకునే అవకాశం కలుగుతుందని, షిప్ యజమానులు పోర్టు సామర్థ్యం, నౌక యొక్క టర్న్ అరౌండ్ సమయాల్ని కూడా ఎంతో ముఖ్యమైన ప్రమాణాలుగా పరిగణిస్తారువినియోగదారులకు నాణ్యమైన సేవలువిశాఖ కంట్కెనర్ టెర్మినల్ ముఖ్యమైన పని తీరు సూచీల (కేపీఐ)లో క్రేన్లు గంటకు 27.5 కదలికల్ని నమోదు చేయడం, బెర్త్ లో షిప్ నిలుపు సమయంలో 13శాతం, పోర్టులో టర్న్ అరౌండ్ ట్కెం 21. 4గంటల్ని నమోదు చేసి అత్యుత్తమ సూచీల్ని నెలకొల్పిందని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవల్ని అందించడంలో టెర్మినల్ ఆపరేటర్లతోకలిసి పోర్టు సంయుక్తంగా చేపట్టిన చర్యలే వీసీటీపీఎల్ ఘనతలో కీలక పాత్ర పోషించిందన్నారు. నేపాల్ ఆధారిత కంట్కెనర్లకు కంట్కెనర్ టెర్మనల్ గేట్వే పోర్టుగా ఉందని, 65కి పైగా కంట్కెనర్ ల్కెన్లు కలిగి ఉందని, కంట్కెనర్ టెర్మినల్కు 8 నిరంతర సర్వీసులున్నాయని గుర్తు చేశారు. పోర్టులోని పీపీపీ ఆపరేటర్ల పని తీరును మారిట్కెం ఇండియా విజన్ (ఎంఐవీ) 2030 నిబంధనలకు అనుగు ణంగా చేపట్టడం జరుగుతుందని, విశాఖ కంట్కెనర్ టెర్మినల్ సాధించిన ఈ ఘనతను దృష్టిలో ఉంచుకుని పోర్టు రివార్డును ప్రకటించిందన్నారు.పోర్టు సాధించిన ఈ అసాధారణ విజ యాన్ని స్టేక్ హెూల్డర్స్, రైల్వేలు, కస్టమ్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం అభినందించాయి. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించడానికి అవసర మైన సహాయ సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ ఘనతను సాధించిన టెర్మినల్ నిర్వాహకులు, పోర్టు కుటుంబ సభ్యుల్ని చ్కెర్పర్సన్ డాక్టర్ ఎం. అంగ ముత్తు ట్విట్టర్ ద్వారా అభినందించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు సరకు రవాణాలో ప్రతిభను కనబర్చి మేజర్ పోర్టుల్లో నాలుగో స్థానంలో నిలిచిం దని, 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే మరో 13.5శాతం వృద్ధిని కనబర్చిందని అధికారులు స్పష్టం చేశారు. విశాఖ పోర్ట్ సాధించిన ఈ ఘనత పట్ల కేంద్ర పోర్టులు, నౌక, జల రవాణా మంత్రి త్వ శాఖ సంతృప్తిని వ్యక్తం చేసి, అంగముత్తు సేవల్ని ప్రశంసించింది.