పుష్ప ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలైపోయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పుష్ప-2 మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబరు 6న పుష్ప-2 రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రకటించిన డేట్ కంటే ఒక రోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో డిసెంబర్ 5వ తేదీనే పుష్ప-2 థియేటర్లలోకి రానుంది. అయితే పుష్ప-2 మూవీని ఎప్పటిలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు హిందీలోనూ ఓకేసారి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప-2 చిత్రాన్ని తొలిసారిగా బెంగాలీ భాషలోనూ విడుదల చేస్తున్నారు. బెంగాలీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ ఏఏ ఫిల్స్మ్ అధినేత అనిల్ తడానీ సొంతం చేసుకున్నారు. పుష్ప-2 అన్ని రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నట్లు అనిల్ తడానీ తెలిపారు.
Share