చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం.. గ్రాండ్ ఈవెంట్కు ఆహ్వానం
Oct 25, 2024
ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు శత దినోత్సవాలకు సంబంధించి జరిగిన ఓ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ ఈసారి అక్కినేని జాతీయ పురస్కారం చిరంజీవికి ఇస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా నేడు నాగార్జున మెగాస్టార్ చిరంజీవిని కలిసి అక్కినేని జాతీయ పురస్కారం స్వీకరించాలని, ఈవెంట్ కి రావాలని ఆహ్వానించారు. దీంతో చిరంజీవి సంతోషం వ్యక్తం చేసారు. అక్టోబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి అమితాబ్ బచ్చన్ రానున్నారు. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందించనున్నట్టు నాగార్జున తెలిపారు.