తెలంగాణ గణేష్ ఉత్సవాలంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఒక ఎత్తయితే.. నిమజ్జన కార్యక్రమం మరో ఎత్తు. అందులోనూహైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు వేరే లెవల్. అయితే గణేష్ నిమజ్జనాలంటే ముందుగా గుర్తొచ్చేది హుస్సేన్ సాగరే. నిమజ్జనం రోజున ట్యాంక్ బండ్ మొత్తం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతుంది. పొద్దున మొదలుపెడితే ఆ తర్వాత రోజు కూడా నిమజ్జనం చేసే విగ్రహాలు ఇంకా మిగిలే ఉంటాయంటే ఎన్ని గణనాథులు హుస్సేన్ సాగర్ ఒడిలో చేర్చేందుకు వస్తాయో అర్థం చేసుకోవచ్చు.కానీ.. ఈసారి హుస్సేన్ సాగర్‌లో గణనాథుల నిమజ్జనానికి అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ చుట్టూ రెయిలింగులకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికల ఫ్లెక్సీలు కట్టారు. దాంతో కొందరు కోర్టుకి వెళ్లగా జీహెఎచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో గణేషుల నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Share