Current Date: 28 Sep, 2024

అరుదైన రికార్డ్ ముంగిట కెప్టెన్ రోహిత్ శర్మ.. జస్ట్ 10 పరుగులే

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ అరుదైన రికార్డ్‌కి అడుగు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో త్వరలో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ మరో 10 పరుగులు చేస్తే 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.ప్రస్తుతం రోహిత్‌ 25 ఇన్నింగ్స్‌ల్లో 990 పరుగులు చేశాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల రికార్డులో శ్రీలంక ఆటగాడు పథుమ్‌ నిసాంక పేరిట ఉంది. నిసాంక ఈ ఏడాది 25 ఇన్నింగ్స్‌ల్లో 1135 పరుగులు చేశాడు.రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లలో తొలుత టెస్ట్‌ మ్యాచ్‌లు, ఆ తర్వాత టీ20లు జరుగనున్నాయి. తొలి టెస్ట్‌ చెన్నై వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి.. రెండో టెస్ట్‌ కాన్పూర్‌ వేదికగా సెప్టెంబర్‌ 27 నుంచి జరుగన్నాయి. అనంతరం అక్టోబర్‌ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.

Share