Current Date: 31 Mar, 2025

18 ఏళ్లకే చెస్ ఛాంపియన్.. దొమ్మరాజు గుకేశ్ మన తెలుగువాడే

ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్ నిలిచారు. చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన.. ఈ 18 ఏళ్ల కుర్రాడు ఛాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్ గేమ్‌లో ఇద్దరికి 6.5 పాయింట్లు వచ్చి టై అయింది. అయితే 14వ గేమ్ లో లిరెన్ ను ఓడించి.. గ్యారీ కాస్పరోవ్ రికార్డును బద్దలు కొట్టారు గుకేశ్. అప్పట్లో 22 ఏళ్ల వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన గ్యారీ కాస్పరోవ్ రికార్డును గుకేశ్ తిరగరాశారు.ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన రెండో భారతీయుడుగా గుకేశ్ నిలిచాడు. అంతకు ముందు ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ సాధించిన భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్ నిలిచాడ. ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచారు. 2013 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన తొలి భారతీయుడు గుకేశ్ కావడం గమనార్హం.గుకేశ్‌ది తమిళనాడులోని తెలుగు కుటుంబం. 2006 మే 29న చెన్నైలో జన్మించారు. గుకేశ్ తండ్రి రజనీకాంత్. ఆయన ముక్కు, చెవి, గొంతు డాక్టర్. తల్లి పద్మ. ఆమె మైక్రోబయాలిజిస్ట్. ఏడేళ్ల వయస్సున్నప్పుడే గుకేశ్ చెస్ ఆడడం నేర్చుకున్నారు. వారంలో మూడు రోజులు, గంట పాటు చెస్ ఆడడాన్ని 2013లో ఆయన ప్రాక్టీస్ చేశారు.వీకేండ్స్ లో ఆయన చెస్ టోర్నమెంట్స్ లో పాల్గొనేవారు. ఆగస్టు 2023 రేటింగ్ లిస్ట్‌లో 2750 పాయింట్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్ నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Share