Current Date: 03 Oct, 2024

రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కడప విద్యార్థినికి కొలువు

కడప నగరానికి చెందిన ఎర్రనాగుల అమృతవల్లి అమెరికాలో ఏడాదికి రూ.1.70 కోట్ల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన ఆమె జేఈఈ పరీక్షలో ప్రతిభ చూపి దుర్గాపూర్‌ ఎన్‌ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌ ఎంఎస్‌ పూర్తిచేశారు. ఎంఎస్‌ డిగ్రీ తీసుకున్న నెల రోజుల్లోనే వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో ప్రఖ్యాత కంపెనీ అమెజాన్‌ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌గా కొలువు సాధించారు. ఉపాధ్యాయులు, బంధువులు, అమృతవల్లికి అభినందనలు తెలియజేశారు.

Share