కొత్త ప్రభుత్వం సారధ్యంలో ఈ నెల 17నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. తొలి రోజున ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుందని నేతలు చెబుతున్నారు. టీడీపీ ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఉపసంహరణ బిల్లును అదే రోజు అసెంబ్లీలో పెట్టి ఆమోదించే అవకాశముందని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.