Current Date: 05 Oct, 2024

15 నెలల తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి 10 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉందని కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదీ కూడా చట్టబద్ద అధికారంగానే ఉందని పేర్కొంది. ఈ విషయం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ నిబంధనల్లోనే ఉందని తెలిపింది. ఇక ఎంసీడీలో సభ్యుల నామినేషన్ వ్యవహారంలో ఎల్జీకి స్థానిక ప్రభుత్వ సలహాలు అవసరం లేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జెపి పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఆ క్రమంలో కేజ్రీవాల్ ప్రభుత్వం గతంలో వేసిన పిల్‌ను కొట్టివేసింది. 

Share