Current Date: 06 Oct, 2024

పెళ్లి కాలేదు కానీ 100 మంది పిల్లలకి తండ్రి

 వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. పెళ్లి కాకుండానే తాను వంద మందికిపైగా పిల్లలకు తండ్రిని అయినట్లు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ స్వయంగా వెల్లడించాడు.ప్రపంచంలోని 12 దేశాల్లో 100 మంది కంటే ఎక్కువ మంది తన పిల్లలు ఉన్నారని పావెల్ దురోవ్ బహిరంగంగా ప్రకటించాడు. 39 ఏళ్ల వయసు ఉన్న పావెల్ దురోవ్‌ ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ తన వీర్యం ద్వారా ఇప్పటికే తండ్రి అయ్యారు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని ఆయన వెల్లడించారు. 15 ఏళ్ల క్రితం తాను 24 ఏళ్ల వయసులో ఉన్నపుడు.తన ఫ్రెండ్ చెప్పిన ఒక విషయంతో తాను ఈ వీర్య దానం చేయడం ప్రారంభించినట్లు పావెల్ దురోవ్ చెప్పారు. అయితే తన ఫ్రెండ్‌కు, అతని భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఆ సమయంలో డాక్టర్లు తేల్చి చెప్పారని. అయితే అదే విషయాన్ని తనముందు ఉంచిన తన మిత్రుడు తనను వీర్య దానం చేయమని కోరినట్లు తెలిపారు. మొదట తన ఫ్రెండ్ చెప్పింది విని తాను ఆశ్చర్యపోయానని సంతానం కోసం తనను వీర్య దానం చేయాలని కోరడంతో బాగా నవ్వుకున్నట్లు పావెల్ దురోవ్ వెల్లడించారు. ఆ తర్వాతే సంతానలేమి అనేది ఎంత పెద్ద సమస్య అనేది అర్థం అయిందని చెప్పారు. దీంతో తాను అప్పటి నుంచి వీర్యదానం చేయడం మొదలుపెట్టినట్లు ఆయన టెలిగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.

Share