వైయస్ జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి ఎవరూ కాదనలేని కారణాలు కొన్ని ఉన్నాయి. అవి.. సంక్షేమం, అభివృద్ధినీ బ్యాలెన్స్ చేయలేకపోవడం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటూ అగ్రకులాల్ని పూర్తిగా విస్మరించడం. సొంత వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, ఎన్నారైలు, హై నెట్ వర్త్ పీపుల్‌ను పూర్తిగా దూరం పెట్టడం. సొంత పార్టీ వాళ్లు ఏదైనా తప్పు చేస్తే మందలించకపోవడం.. చేతులు కాలాక వారిని పూర్తిగా తప్పించేయడం. ప్రత్యర్థులకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటం.నిజానికి జగన్ ఒకటి బలంగా నమ్మాడు. గతంలో చేసిన వాగ్దానాలని నిలబెట్టుకోని చంద్రబాబుని జనం నమ్మరనుకున్నారు. కానీ.. రాష్ట్రంలోని అత్యధిక సంఖ్యాకులకి గతం గుర్తుండదని, వర్తమానంలో కనిపిస్తున్న ఆశ వెనుకే పరుగెడతారని ఊహించలేకపోవడం అనుభవరాహిత్యానికి నిదర్శనం. ప్రజలతో టచ్ లేకపోవడం.. చివరికి ఎమ్మెల్యేలు, మంత్రులకి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం రాంగ్ మెసేజ్ పంపింది. ఐదేళ్లలో ఒకే ఒక్కసారి ప్రెస్‌మీట్‌లో జగన్ మాట్లాడారంటే అన్ని వర్గాలను అతను ఎంత దూరం అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.ఓవరాల్‌గా 2019 ఎన్నికలకి ముందు జనంలో ఉన్న జగన్.. గెలిచాక ప్యాలెస్‌లో మాత్రమే ఉండిపోయాడు. దాంతో జనం అతనికి పూర్తిగా దూరమైపోయారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం.