Current Date: 02 Apr, 2025

రీఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్ రంభ.. కండీషన్స్ అప్లై

సీనియర్‌ హీరోయిన్‌ రంభ రీఎంట్రీ ఇవ్వబోతోంది. అందం, అభినయంతో తెలుగులో ఒకప్పటి స్టార్ హీరోలందరితో నటించిన రంభ ఇటీవల తన రీఎంట్రీపై మాట్లాడుతూ ‘‘సినిమా అంటే నాకెంతో ప్రేమ.. వెండితెరకు తిరిగి రావడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది. పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఉండే పాత్రల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను. కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ఎదురుచూస్తున్నా’’ అని రంభ స్పష్టం చేసింది.ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో తెరంగేట్రం చేసిన రంభ..  ఆ తర్వాత తొలి ముద్దు, బంగారు కుటుంబం, ముద్దుల ప్రియుడు, హిట్లర్‌, అల్లుడా మజాకా!, బావగారు బాగున్నారా?, బొంబాయి ప్రియుడు, గణేష్‌, మూడుముక్కలాట.. ఇలా అనేక చిత్రాల్లో నటించింది. అలానే కన్నె పిట్టరో కన్ను కొట్టరో.. వంటి ఐటం సాంగ్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది. 2010లో బిజినెస్‌మెన్‌ ఇంద్రకుమార్‌ పద్మనాథన్‌ను పెళ్లి చేసుకుని.. సినిమాలకు గుడ్‌బై చెప్పిసి కెనడాలో సెటిలైంది.

Share