ఐపీఎల్ 2024లో ఫైనల్ బెర్తుని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాయం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా టీమ్.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో గెలవడం ద్వారా ఫైనల్‌కి చేరేందుకు హైదరాబాద్‌కి ఇంకో ఛాన్స్ ఉంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడంతో ఈ ఆప్షన్ హైదరాబాద్‌కి లభించింది.
క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకి ఆలౌటైంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌ల్లో ఏకంగా 250పై చిలుకు స్కోరు చేసిన హైదరాబాద్ టీమ్ కీలక మ్యాచ్‌లో ఇలా బ్యాటింగ్ ఫెయిలవడం అభిమానుల్ని బాధించింది. మరీ ముఖ్యంగా.. టీమ్‌కి ప్రధాన బలమైన ఓపెనర్లు ట్రావిస్ హెడ్ డకౌటవగా.. అభిషేక్ శర్మ 3 పరుగులకే స్టార్టింగ్‌లోనే ఔటైపోయారు. దాంతో చివరి వరకు హైదరాబాద్ కోలుకోలేకపోయింది.
లక్ష్యఛేదనలో కోల్‌కతా టీమ్‌కి మెరుగైన ఆరంభం లభించకపోయినా.. వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు నమోదు చేసి ఆ జట్టుకి 13.4 ఓవర్లలోనే విజయాన్ని అందించారు. ఇప్పటికే 2012,2014లో టైటిల్ గెలిచిన కోల్‌కతా టీమ్ చాలా సీజన్ల తర్వాత మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టింది.