Current Date: 04 Jul, 2024

నిజంగా అంతమాటన్నాడా.. బన్నీ??

"సైకిల్‌"కు పంచర్లు వేసుకునే వాడివి అని నాగబాబుపై అల్లు అర్జున్ సంచలన ట్వీట్!!
అల్లు అర్జున్ 'పుష్ప' తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తగ్గేదేలే అంటూ స్టార్స్ సైతం తనను ఫాలో అయ్యేలా చేశాడు. త్వరలో సెకండ్ పార్ట్ తో ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది కూడా. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ తట్టుకోలేక పోయారు. ముఖ్యంగా నాగబాబు దీనిపై ట్వీట్ కూడా చేశారు. పక్కనే ఉంటూ వెన్ను పోటు పొడిచినట్లు పోస్ట్ పెట్టాడు. అయితే ఇది ఇండైరెక్ట్ గా బన్నీనే అన్నట్లుగా నెట్టింట చర్చ జరిగింది.
ఈ క్రమంలో ఈ ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లయ్ ఇచ్చినట్లుగా ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. 'అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ముందున్న సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకునేటోడు' అన్నట్లు ఉన్న పోస్ట్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఐతే ఈ పోస్ట్ బన్నీ పెట్టలేదని.. ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు అంటుంటే.. అలా కావాలనే డిజైన్ చేశారని మరికొందరు చెప్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ రాజకీయంగా రచ్చ లేపుతుంది