నాగార్జున యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ తన పదవికి రాజీనామా చేశారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన చాంబర్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేశారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌కు తాళం వేసి నిరసన ప్రదర్శనలు చేశారు. విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన వీసీ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపినట్లు సమాచారం.కాగా ఏపీలో విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. నిన్నటి వరకు ఎనిమిది మంది వర్సిటీ వైస్ ఛాన్సలర్‌లు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఇద్దరు వైస్ ఛాన్సలర్‌లు రాజీనామా చేశారు. ఆచార్య నాగార్జున, విక్రమ సింహపురి వర్సిటీల వైస్ ఛాన్సలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.